సత్తా చాటిన కేవీ-1 ఉప్పల్

ఉప్పల్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు సత్తా చాటారు. కేవీ కంచన్ బాగ్ లో నిర్వహించిన 19లెవల్ క్లస్టర్ కప్స్ అండ్ బిల్ బుల్స్ ఉత్సవ్ లో కేవీ-1 ఉప్పల్ విద్యార్థులకు ఆల్ రౌండ్ ప్రతిభకు గాను డివిజనల్ కమిషనర్ షీల్డ్ ను సాధించారు. ఉప్పల్ కేవీ -1 నుండి పలువురు విద్యార్థులు కంచన్ బాగ్ లో జరిగిన ఉత్సవ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందచేశారు. కేవీ-1 ఉప్పల్ విద్యార్థులు ఆల్ రౌండ్ ప్రతిభ కనబర్చడంతో వారికి ట్రోఫీ దక్కింది. పెయింటింగ్, డ్రాయింగ్, క్లే మౌల్డింగ్,హ్యాండీ క్రాఫ్ట్ ల వంటి అనేక విభాగాల్లో పోటీలు జరిగాయి. కేవీ-1 ఉపాధ్యాయులు పద్మా,అనితాదాస్,ఉషారాణిల నేతృత్వంలో విద్యార్థుల బృందం ఈ పోటీల్లో పాల్గొనింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *