చంద్రబాబుని పొడిగిన కేటీఆర్

హైదరాబాద్ కు ఐటి పరిశ్రమలు రావడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విశేషంగా కృషి చేశారని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.హైటెక్స్‌ సిటీలో జరిగిన టెక్‌ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, యాపిల్‌ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు.రానున్న రోజుల్లో హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ పేర్కొన్నారు. కొద్ది రోజుల్లోనే ఏ నగరమూ ఆభివృద్ది చెందదని అన్న ఆయన హైదరాబాద్ నగరానికి 450 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఐటి పరిశ్రమతో పాటుగా అన్ని రంగాలకు చెందిన పరిశ్రమలకు కావాల్సిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. ఎటువంటి అనుమతులు ఐనా కొద్ది రోజుల్లోనే ఇస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పరిశ్రమలు మౌళిక వసతులు కల్పించడంతో పాటుగా వారికి రాయితీలు కల్పిస్తోందన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ కు ఎన్నో అదనపు హంగులు ఉన్నాయని చెప్పారు. బెంగళూరు కన్నా హైదరాబాద్ ఎంతో మెరుగ్గా ఉందన్నారు.
రానున్న రోజుల్లో ఏపీ రాజధాని అమరావతి కూడా అభివృద్ది చెందుతున్నారు. అయితే అందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు.