జూన్ కల్లా ఐటి కారిడార్ కు మెట్రో రైలు

మెట్రో రైల్వే స్టేషన్లలో ప్రజల కనీస అవసరాలపై దృష్టి పెట్టాలను మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. మెట్రో స్టేషన్లలో కనీస అవసరా కొరత తీవ్రంగా ఉందని వస్తున్న వార్తల నేపధ్యంలో మంత్రి ఈ ఆదేశాలను జారీ చేశారు. మెట్రోను ప్రారంభించిన తరువాత ప్రజల స్పందన, వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి మెట్రో అధికారులతో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెట్రో స్టేషనల్లలో మంచి నీరు, మూత్రశాలల వంటి కనీస అవసరైలపై దృష్టిపెట్టాలన్నారు. పార్కింగ్ సౌకర్యం కల్పించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్నారు.
మెట్రో రైలు ప్రయాణం, స్మార్ట్ కార్డుల వినియోగం వంటి అంశాల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. మెట్రో లో భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడవద్దని సూచించిన మంత్రి అవసరనమైనంత మేరకు పోలీసు శాఖ సహాయం తీసుకోవాలన్నారు. మెట్రో స్టేషన్ మార్గాల్లో ఎక్కువగా బస్సులు నడపాలని మంత్రి సూచించారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు మెట్రో మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లకు బస్సులు తిరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఐటి కారిడార్లో మెట్రో పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. రానున్న జూన్ నాటికి ఐటి కారిడార్లో రైళ్లు తిరేగేలా మెట్రో అధికారులు టార్గెట్ పెట్టుకుని పనిచేయాలన్నారు. జూన్ కల్ల ఐటికారిడార్లో మెట్రో రైలును నడిపించాలని దీనికోసం ఇప్పటి నుండి ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి సూచించారు.
ad 1Leave a Reply

Your email address will not be published. Required fields are marked *