‘లీడర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్న కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో జరిగిన బిజినెస్ వరల్డ్ స్మార్ట్ సిటీస్ కాంక్లేవ్ అవార్డు కార్యక్రమంలో ‘లీడర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని చెప్పారు. ప్రతీ ఇంటికి మంచినీరు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను పూర్తిగా అధికమించినట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్ ను ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్ ను అందిచనుందని చెప్పారు. విద్యుత్ కొరతను అధికమించడంలో తమ ప్రభుత్వం సఫలం అయిందని అన్నారు. మౌళిక సదుపాయాలను మెరుగు పర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపి కవిత కూడా పాల్గొన్నారు.