ప్రముఖ హీరోయిన్ కృష్ణ కుమారి మృతి

0
52

అలనాటి అందాల తార కృష్ణకుమారి కన్నుమూశారు. గత కొంతచాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని తన నివాసంతో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్తు 84 సంవత్సరాలు. అలనాటి మేటినటీమణుల్లో ఒకరైన కృష్ణ కుమారి 100కు పైగా చిత్రాల్లో నటించారు. అమె తెలుగుతో పాటుగా తమిళ,కన్నడ,మళయాల భాషల్లో హిరోయిన్ గా నటించారు. గ్లామర్ హీరోయిన్ గా అనేక పాత్రల్లో ఒదిగిపోయిన ఆమె తెలుగు సినీ దిగ్గజాలు ఎన్టీఆర్,ఏఎన్నార్ సరసన అనేక సినిమాల్లో నటించారు. పల్లె పడుచు, బంగారు పాప, ఇలవేల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు, భార్యాభర్తలు, కులగోత్రాలు లాంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించార.
కృష్ణ కుమారి సోదరి షావుకారు జానకి కూడా సినీ హీరోయిన్ గానూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ సుపరిచితురాలు. కృష్ణ కుమారి పాత్రికేయుడు, వ్యాపార వేత్త మోహన్ ఖైతాన్ ను వివాహం చేసుకుని బెంగళూరులో స్థిరపడ్డారు. 1980 నుండి సినీరంగానికి ఆమె దూరంగా ఉన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here