కోమటిరెడ్డి , సంపత్ లకు హైకోర్టులో ఊరట | Relief for Komatireddy,Sampath

తెలంగాణ అసెంబ్లీ నుండి భహిష్కరణ వేటును ఎదుర్కొంటున్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై విధించిన భహిష్కరణను వెంటనే తొలగించాలని వారి పదవీకాలం ముగిసే వరకు వారిని శాసనసభ్యులుగా కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అసెంబ్లీ తీసుకున్న క్షణ శిక్షణా చర్యలను కోర్టు కొట్టివేస్తూ ఆదేశాలు జారీచేసింది. దీనితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల శాసనసభా సభ్యత్వాలను రద్దు చేస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగ సమయంలో కాంగ్రెస్ కు చెందిన వీరిద్దరూ అనుచితంగా ప్రవర్తించారని వీరు విసిరిన హెడ్ ఫోన్ తగిన శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు తగిలిందని పేర్కొన్న అసెంబ్లీ వీరి అనుచిత ప్రవర్తనను తప్పబడుతూ వారి శాసనసభ సభ్యత్వాలను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇద్దరు శాసన సభ్యులు కోర్టును ఆశ్రయించారు.
కోమటిరెడ్డి వేంకట్ రెడ్డి, సంపత్ ల శాసన సభ సభ్యత్వాలు రద్దయినట్టుగా అధికారిక ఉత్తర్వులు ఎన్నికల సంఘానికి అందడంతో ఎన్నికల సంఘం వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభా స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కూడా ఆదేశాలు జారీచేసింది. అసెంబ్లీ, ఎన్నికల సంఘాల నిర్ణయాలను సవాలు చేస్తూ ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి శాసన సభ సభ్యత్వాలను రద్దుచేస్తూ తీసుుకున్న నిర్ణయం చెల్లదని ప్రకటించింది.
శాసనసభా సభా సభ్యత్వాలు రద్దయినట్టు ఉత్తర్వులు రావడంతో వీరు రాజ్యసభ ఎన్నికల్లోనూ ఓటువేయలేకపోయారు.
ఈ కేసుకు సంబంధంచి కోర్టు విచారణలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ సమావేశాల రికార్డును కోర్టుకు సమర్పించాల్సిందిగా న్యాయమూర్తులు ఆదేశాలు జారీచేయడంతో పూర్తి వీడియోను ఇవ్వలేకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.
కోర్టు తీర్పుతో దీనికి సంబంధించిన అన్ని జీవోలు రద్దయినట్లేనని వీరిద్దరి తరపున వాదించిన లాయర్ స్పష్టం చేశారు. వీరి శాసనసభా సభ్యత్వాల రద్దుకు సంబంధించిన అన్ని ఉత్తర్పులు చెల్లవని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతల హర్షం
కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ లు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిన కోర్టులో తమకు న్యాయం జరిగిందని వారన్నారు. కోర్టుపై తమకు ముందునుండే నమ్మకం ఉందని, ఖచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని భావించినట్టు వారు పేర్కొన్నారు.
హైకోర్టు వెలువరించిన తీర్పు పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు శాసనసభ్యులను కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తారు.
komatireddy, komatireddy venkat reddy, congress, telangana congress, telangana assembly, congress mla, sampath, congress mla sampath, nalgonda, nalgonda congress leaders, high court, congress leaders, congress leaders suspend, election commission, telangana mla,
భహిష్కరణ వేటు
Telangana_Legislative_Assembly
Lower_house
Parliament
Legislature
Budget