ఇటలీలో కోహ్లీ-అనుష్కల పెళ్లి వచ్చేవారమే ?

భారత క్రికెట్ జట్టు కెప్టన్ విరాట్ కోహ్లీ పెళ్లీ పీటలెక్కబోతున్నాడు. చాలా కాలంగా ఇప్పుడు, అప్పుడు అంటూ వస్తున్న కోహ్లీ పెళ్లి వార్తలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. కోహ్లీ తన ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మను వచ్చేవారంలో పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. డిసెంబర్ 9,10,11,12 వ తేదీల్లో కోహ్లీ, అనుష్కలు ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. పెళ్లి, సంగీత్ తదితర కార్యక్రమాలు అన్నీ ఇటలీలోనే జరగబోతున్నాయి. శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగియడంతో కోహ్లీ గురువారం నాడు ఇటలీకి వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అటు కోహ్లీ, ఉటు అనుష్క శర్మ ల కుటుంబ సభ్యలు, సన్నిహితులు ఇటలీ చేరుకున్నట్టు సమాచారం.
శ్రీలంకతో జరిగే టి-20 మ్యాచ్ లలో కోహ్లీ ఆడడం లేదు. పెళ్లి కోసమే కోహ్లీని టి-20 జట్టులో ఎంపికచేయలేదని అంటున్నారు. దక్షిణ ఆఫ్రీకా టూర్ కు సన్నద్దం కావాల్సి ఉన్నందున విపరీతమైన క్రికెట్ ఆడుతున్నకోహ్లీకి విశ్రాంతి ఇచ్చినట్టు బీసీసీఐ చెప్తున్నప్పటికీ పెళ్లి కోసమే టి-20కి కోహ్లీని ఎంపికచేయలేదని తెలుస్తోంది. వీరి పెళ్లిని అట్టహాసంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే పెళ్లికి భారత క్రికెటర్లు ఎవరూ హాజరు కావడం లేదు. వారి కోసం ప్రత్యేకంగా డిసెంబర్ 21న ముంబాయిలో రిసెప్షన్ ను ఏర్పాటు చేసినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *