విరాట్ , అనుష్కలకు అభినందల వెల్లువ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దంపతులకు సగటు సినీ అభిమానులతో పాటుగా క్రికెట్, సినీ వర్గాల నుండి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ క్రికెటర్లు, సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తమ పెళ్లి విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఫొటోలు కూడా విడుదల చేయడంతో వీరికి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. సచిన్ టెండుల్కర్ తో పాటుగా పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. బాలీవుడ్ నుండి కూడా పెద్ద సంఖ్యలో నటులు ఈ కొత్త జంటను అభినందించారు. త్వరలోనే ఈ జంట ఢిల్లీ, ముంబాయిల్లో వివాహ విందులు ఇవ్వనుంది. విరాట్ అనుష్కల పెళ్లి వీడియో దృశ్యాలు కొన్ని కూడా బయటకు వచ్చాయి…