మంద కృష్ణకు మద్దతు పలికిన కోదండరాం

ఎమ్మార్పీస్ అధినేత మందకృష్ణ మాదిక మీద పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ పొల్టికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. చంచల్ గూడ జైల్లో ఉన్న మంద కృష్ణ మాదిగను కలిసిన తరువాత కోదండరాం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు వర్గీకరణ సమస్యమీద అఖిలపక్షాన్ని వెంటనే ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని కోదండరాం డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాల వల్లే వర్గీకరణ సమస్య తీవ్రమవుతోందన్నారు. ప్రజాస్వాయ్యంలో ఆదోళనలు సహజమేనని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఉధ్యమ సమయంలోనూ అనేక ఆందోళన కార్యక్రమాలను నిర్వహించామని ఆయన చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విమర్శలను తట్టుకునే స్థితిలో లేదని చిన్న పాటి ఆందోళనలను కూడా ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.