నీలోఫర్ లో చిన్నారి కిడ్నాప్

నీలోఫర్ ఆస్పత్రి నుండి నవజాత శిశువు కిడ్నాప్ కు గురైంది. బాధితుల కథనం ప్రకారం పాతబస్తీకి చెందిన నిర్మల పేట్లబురుజ ఆస్పత్రిలో బాలుడికి జన్మనిచ్చింది. చిన్నారికి నిమోనియా లక్షణాలు కనిపించడంతో నిలోఫర్ ఆస్పత్రిలో చూపించాల్సిందిగా పేట్ల బురుజ ఆస్పత్రి వర్గాలు సూచించడంతో చిన్నారిని అమ్మమ్మ కల్పనతో నీలోఫర్ కు ఆస్పత్రికి పంపించారు. అక్కడ కల్పనకు తారసపడిన ఓ మహిళ కల్పనకు సహాయం చేస్తున్నట్టుగా నటిస్తూ చిన్నారిని తీసుకుని పోయింది. దీనితో గుర్తుతెలియని మహిళ కోసం గాలించిన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
చిన్నారిని నేను చూసుకుంటాను టీ తాగి రమ్మని చెప్పిన గుర్తు తెలియని మహిళ చిన్నారితో ఉడాయించిందని కిడ్నాప్ కు గురైన చిన్నారి అమ్మమ్మ చెప్తోంది. సదరు మహిళ ఆస్పత్రి అంతా కలియతిరిగిందని ఇదే ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తున్నట్టు తనకు చెప్పిందని ఆమె వాపోయింది. ఆస్పత్రిలోని సిబ్బందితోనూ ఆమె మాట్లాడుతూ కనిపించిందని ఆస్పత్రి సిబ్బందికి కూడా ఈ కిడ్నాప్ లో పాత్ర ఉందని బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డను అప్పగించాలని ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందంటూ చిన్నారి బంధువులు ఆస్పత్రి ఎదుటు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీనితో రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారిని సముదాయించి కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *