ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థలపై ఐటీ దాడులు

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి చెందిన వ్యాపార సంస్థలతో పాటుగా ఆయన నివాసంలో ఇన్ కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎంపీకి చెందిన 18 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. వీటిలో హైదరాబాద్ లో 12 ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించగా స్వస్థలం ఖమ్మంలో మరో 6చోట్ల సోదాలు సాగుతున్నాయి. ఖమ్మంలోని ఎంపీ నివాసంలోనూ ఐటీ అధికాలు సోదాలు జరుపుతున్నారు. గేట్లను మూసివేసిన అధికారులు ఇంట్లోకి ఎవరినీ వెళ్లనీయడం లేదు. ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ కు చెందిన ఎంపీ నివాసాలు, వ్యాపార సంస్థల్లో జురుగుతున్న సోదాలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీటిపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో దాడులు జరుగుతుండడం గమనార్హం. అయితే ఇవి సాధారణ తనిఖీలేనని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఐటి అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని వారు అడిగిన పత్రాలను అందిస్తున్నామని చెప్పారు. 2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోటీచేసి గెల్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అటు తర్వాత 2016లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
khammam mp, khammam, ponguleti srinivas reddy.
అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా:రాహుల్ గాంధీ