ఆకట్టుకున్న కేసీఆర్ ప్రసంగ ఝరి-మీరే చూడండి

ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం ఆద్యాంతం సభికులను ఆకట్టుకుంది. అందరినీ ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయడంలో దిట్ట అయిన కేసీఆర్ తనలోని కవిని, విశ్లేషకుడిని, సాహితీవేత్తను మరోసారి బయటకు తీసకుని వచ్చారు. తెలుగు కవులు, సాహితీ మూర్తుల పేర్లను ఉటంకిస్తూ పద్యాలు చెప్తూ ఆయన చేసిన ప్రసంగానికి సభికులతో పాటుగా టీవీల్లో ఆయన ప్రసంగాన్ని చూసిన వారంతా మంత్రముగ్ధులయ్యారు. తెలుగు పై మంచి పట్టున్న కేసీఆర్ ప్రసంగిస్తున్నంతసేపు అంతా మైమరిపోయి వింటూ ఉన్నారు. వేదిక పై ఉన్న ప్రముఖులు సైతం కేసీఆర్ ప్రసంగ ఝరిలో తడిసిముద్దయ్యారు.