తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఢిల్లీలో కంటి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న కేసీఆర్ కంటిపై ఎక్కువ వెలుతురు పడకుండా నల్ల కళ్లద్దాలను వాడుతున్నారు. మాజీ తమిళనాడు సీఎం కరుణానిధి, ఎంజీఆర్ లు వాడే కళ్లద్దాల తరహాలో కనిపిస్తున్న కేసీఆర్ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కేసీఆర్ వెనుక నిల్చుని ఉన్న ఆయన కుమారై కవిత నవ్వుతున్న తీరుపై చాలా మంది సరదాగా కామెంట్లు చేస్తున్నారు.