కేసీఆర్ వ్యాఖ్యలు పొరపాటే-ఉద్దేశపూరితం కాదు:కవిత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడిపై చేసిన వ్యాఖ్యల్లో పొరపాటు దొర్లిందని కేసీఆర్ కుమారై, ఎంపి కవిత చెప్పారు. ప్రధానమంత్రిని కించపర్చే ఉద్దేశం కేసీఆర్ కు ఏమాత్రం లేదని చెప్పిన కవిత అనుకోకుండా జరిగిన పొరపాటుగా పేర్కొన్నారు. ప్రధాన మంత్రిని నిందించే సంకుచిత మనస్తత్వం కేసీఆర్ ది కాదన్నారు. జరిగిన విషయంపై బీజేపీ అనవసరంగా రాద్దాంతం చేస్తోందని కవిత మండిపడ్డారు. కేసీఆర్ పై బీజేపీ నేతలు పనిగట్టుకుని విషపు ప్రచారం చేస్తున్నారని ఇది సరైంది కాదన్నారు.
రైతుల ఆదాయం పెంచుతామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ దీనికి సంబంధించిన సరైన ప్రణాళికను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కవిత చెప్పారు. దీనిపై పార్లమెంటులో తమపార్టీ తరపున గళం వినిపిస్తామన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో పార్లమెంటులో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రంతో ఖచ్చితంగా పోరాడతామని ఎటువంటి రాజీలేని పోరాటం చేస్తామన్నారు. జీఎస్టీవల్ల రాష్ట్రానికి భారీగా నష్టం వాటిల్లిన విషయాన్ని కవిత గుర్తుచేశారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రప్రభుత్వమే భరించాలని కవిత డిమాండ్ చేశారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *