కత్తి మహేష్ పై పోలీసుల భహిష్కరణ వేటు

ఒక వర్గానికి చెందిన ఆరాధ్యదేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై తెలంగాణ పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఆరు నెలలపాటు అతను గరంలో ప్రవేశించకుండా నిషేధం విధించారు. పోలీసుల అనుమతి లేకుండా నగరంలోకి వస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కత్తి మహేష్ పై నగర భహిష్కరణ విధించిన విషయాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్చ పేరుతో ఎవరినైనా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చ సందర్భంగా కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహేశ్ వ్యాఖ్యలపై పలు హింధూ ధార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కత్తి మహేష్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పూనుకున్నాయి. దీనిపై స్పందించిన పోలీసులు కత్తి మహేశ్ పై నగర బహిష్కరణ వేటు వేశాయి. చర్చావేదికల పేరిట రెచ్చగొట్టే చర్యలకు దిగితే తీవ్రపరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసుల హెచ్చరించారు.
ప్రపంచంలోని ఏ మూలకు చెందినవారైనా హైదరాబాద్ కు వచ్చిన బతకవచ్చని అయితే నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపైమాత్రం చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. మరో వైపు కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసిన టీవీ ఛానల్ కూడా నోటీసులు అందచేసినట్టు డీజీపీ వివరించారు. సదరు ఛానల్ వారు ఇచ్చే సమాధానం పై వారిపై చర్యతీసుకునే అంశం ఆధారపడి ఉంటుందని చెప్పారు. టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాలు, వార్త పత్రికలు శాంతి భద్రతలను కాపాడే విషయంలో సంయమనం పాటించాలని డీజీపీ సూచించారు.