కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ 5గురు ఉగ్రవాదల హతం

జమ్ముకాశ్మీర్ లోని పోషియాన్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరుగుతోంది. ఇప్పటివరకు ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. కరడుగట్టిన లష్కరే తేయిబా ఉగ్రవాది ఉమర్ మాలిక్ కూడా ఈ ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు. ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందుకున్న భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపట్టగా ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీనితో అప్రమత్తమైన బలగాలు ఎదురుదాడికి దిగాయి. రెండు వైపులా భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం మీద ఐదురుగు ఉగ్రవాదులను మన బలగాలు మట్టుపెట్టగలిగాయి.
ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అధునాత ఆయుదాలతో సహా భారీగా మందుగుండ సామాగ్రీ పట్టుబడింది. కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులకు సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది. ఇందులో ఒకరిని మాత్రమే గుర్తించగలిగారు. మికతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్ కౌంటర్ పూర్తయితే తప్ప ఇతర వివరాలను అందించలేమని సైనికాధికారులు వెళ్లడించారు. సైన్యంతో పాటుగా పారామిలటరీ బలగాలు, జమ్ము కాశ్మీర్ పోలీసులు కూడా ఎన్ కౌంటర్ లో పాల్పంచుకుంటున్నారు. మొత్తం ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారు అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని, ఘటనా స్థలం నుండి అయితే ఎవరూ తప్పించుకునేందుకు ఆస్కారం లేదని సైనిక అధికాలు చెప్పారు.
encounter, encounter at kashmir, kashmir encounter.

మల్కాజ్ గిరి రాంచంద్రరావు సొంతమవుతుందా?