మెరినా బీచ్ లోనే కరుణానిధి అంత్యక్రియలు

0
55
కరుణానిధి అంత్యక్రియలు

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు చెన్నైలోని మెరినా బీచ్ వద్ద జరగనున్నాయి. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత అంత్యక్రియలు జరిగిన మార్గంలోనే కరుణానిధి అంత్యక్రియలు జరుగుతాయి. మెరినా బీచ్ లో తమ నేత అంత్యక్రియలు నిర్వహించాలంటూ డీఎంకే పార్టీతో పాటుగా కురణ కుటుంబసభ్యులు చేసిన విజ్ఞప్తిని తమిళనాడు ప్రభుత్వం అంగీకరించలేదు. ఇప్పటికే మెరినా బీచ్ వద్ద నేతల అంత్యక్రియలకు సంబంధించిన వ్యాజ్యాలు కోర్టులో పెండింగ్ లో ఉండడంతో పాటుగా బీచ్ ప్రాంతం నావికాదళం ఆధీనంలో ఉన్న కారణంగా అక్కడ అంత్యక్రియలకు అనుమతించలేమని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.
దీనిపై డీఎంకే వర్గాలు కోర్టును ఆశ్రయించాయి. మాజీ ముఖ్యమంత్రుల అంత్యక్రియలకు మెరినా బీచ్ వద్ద స్థలం కేటాయించలేమంటూ తమిళనాడు ప్రభుత్వం కోర్టులో వాదించింది. డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉండగా మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ అంత్యక్రియలు కూడా మెరినా బీచ్ వద్ద జరగలేదనే విషయాన్ని ప్రభుత్వం కోర్టుదృష్టికి తీసుకునివచ్చింది. అయితే ఈ వాదనను డీఎంకే కొట్టిపారేసింది. నాడు కామరాజ్ అంత్యక్రియలకు మెరినా బీచ్ లో నిర్వహిస్తామని ఆయన వారసులు కోరలేదని స్పష్టం చేసింది. మెరినా బీచ్ లో అంత్యక్రియలు నిర్వహించరాదంటూ కోర్టుకెక్కిన తంబిదురై తన పిటీషన్ ను వాపస్ తీసుకోవడంతో కరుణానిధి అంత్యక్రియలకు మెరినా బీచ్ ప్రాంతంలో స్థలం కేటాయింపుకు వచ్చిన అభ్యంతరాలు ఏమిటని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించని కోర్టు మెరినా బీచ్ ప్రాంతంలో కరుణానిధి అంత్యక్రియలకు స్థలాన్ని కేటాయించాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది.
కోర్టు ఆదేశాలతో అంత్యక్రియలు జరగాల్సిన ప్రదేశంపై నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన డీఎంకే కార్యకర్తలు కోర్టు తీర్పుతో శాంతించారు. మెరినా బీచ్ ప్రాంతంలోని అన్నాదురై సమాధి ఉన్న ప్రాంతంలోనే కరుణానిధి పార్ధీవ దేహాన్ని ఖననం చేయనున్నారు.
ఆయన పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్ లో ఉంచారు. సాయంత్రం 4.00 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కరుణానిధి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజాజీ హాల్ కు చేరుకుని తమ ప్రియతన నేతను అంతిమసారి దర్శించుకుంటున్నారు. కరుణానిధి బౌతికకాయాన్ని చూసిన ఆయన అభిమానలు బోరున విలపిస్తున్నారు. తమ ప్రియతమ నేత విగతజీవిగా మారడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
కరుణానిధికి అంతిమ నివాళులు అర్పించేందుకు రాజకీయ, సనీ ప్రముఖులు రాజాజీ హాల్ కు క్యూకట్టారు. ప్రధాని మోడీతో తోపాటుగా పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు చెన్నై చేరుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో పాటుగా ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కరుణానిధి భౌతికాయానికి నివాళులు అర్పించారు. సినీ దిగ్గజాలు రజనీకాంత్, కమలాసన్ తో పాటుగా అనేక మంది సినీ ప్రముఖులు ఆయన బౌతికకాయానికి నివాళ్లు అర్పించారు.
రాజధాని చెన్నైతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. దుకాణాలు, వాణిజ్యసముదాయాలు స్వచ్చంధంగా మూసివేశారు. ఆర్టీసీబస్సలు తిరగడం లేదు. తమిళనాడు ప్రభుత్వం ఆరురోజులపాటు సంతాపదినాలు ప్రకటించగా కేంద్ర ప్రభుత్వం ఒక రోజు జాతీయ సంతాపదినంగా ప్రకటించింది.
Karunanidhi funeral, marina beach, chennai.

Wanna Share it with loved ones?