"ఇద్దరు " నింగికెగసారు

0
7

ఓ అనుంగు సోదరా .. అరుదైన ఆప్తుడా .. ఆశ్రయ మూర్తీ .. మరలిపోయావా..మొన్న్నటి పొద్దున మీసం మొలిచిన వయసులో ఆకులో తిన్నాం .. ఓ చాపలో నిదురించాం .. నీ జ్ఞాపకాల కన్నీటితో నిండుతోంది నా హ్రుదయంలో .. మన కనులే వేరు .. కన్న కల ఒక్కటే .. మన మనసులే వేరు ..అంతరంగం ఒక్కటే .. మన కోటలు వేరు వేరు ..కానీ గమ్యం వేరు .. నాకు ఎదురెళ్లి ముందుండాలని మహా ముచ్చట. పడ్డావు .. చావులో నాకే ముందెళ్లి చరిత్ర వైనావో ..నాకు విజయమాల వేసిన కరమెక్కడ ??
నా వేడి కన్నీళ్లు తుడిచిన వేళ్లెక్కడ ??కొత్త వేణువు స్వరంలా వినిపించే కోయిల గొంతెక్కడ ??ముద్దుగా నా పదును మాటలు పలికిన పెదవులెక్కడ ??నన్ను అలనాడు ఎత్తి మోసిన ఆ యువ భుజాలెక్కడ ??నాకిక కనపడవా మిత్రమా ??నువ్వు గింజంత ధ్వేషమే లేదు .. మొలకంత కూడా పగే లేదు ..మనసు పవిత్రమవడానికి మార్గం మరణమొక్కటేనా ?? నీతోటి ఒక మాట చెప్పాలనుకున్నాను .. వీలుకాలేదు
అలసి ఉన్న నిన్ను చూసి ఎలా ఉన్నావు అని అడగాలనుకున్నాను ..వీలుకాలేదు ..ఇవాళ
పువ్వులాంటి నీ ముఖానికి ముద్దు పెట్టాలనుకున్నాను .. వీలుకాలేదు
ముంచుకొచ్చే కన్నీళ్లకి మూత పెట్టాలనుకున్నాను .. వీలు కాలేదు
పోయిరా మిత్రమా .. నీ పక్కనే నాకు ఒక పడక వేసి ఉంచు .. ఏనాడో ఒకనాడు నువ్వున్న చోటికే వస్తా ..
(ఆనాడు ప్రాణ హితుడు ఎంజీయార్ కన్నుమూసినప్పుడు కరుణానిధి బాధాక్షరాలతో రాసుకున్న కన్నీటి కవిత్వం .)

మెరినా బీచ్ లోనే కరుణానిధి అంత్యక్రియలు


వంటపని, ఇంటి పని చేయించడం గృహహింస కాదు:బాంబే హైకోర్టు
karuna and mgr

Wanna Share it with loved ones?