మరో ఐదురోజుల సీబీఐ కష్టడీకి కార్తీ చిదంబరం

కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంను మరో ఐదురోజుల పాటు సీబీఐ కష్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ అరెస్టు చేసిన కార్తీ చిదంబరాన్ని కోర్టులో ప్రవేశపెట్టగా 15రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. విచారణ కోసం 15రోజుల పాటు తమ కష్టడీకి అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ పెట్టుకున్న అభ్యర్థనను తోసిపుచ్చి కేవలం ఒక రోజు కష్టడీకి కోర్టు ముందుగా అనుమతి ఇచ్చింది. అయితే కార్తీ చిదంబరం తమతో సహకరించడంలేదని దర్యాప్తు జరపాడిని అతన్ని మరిన్ని రోజుల పాటు తమ కష్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ పెట్టుకున్న అభ్యర్థనను పరిశీలించిన కోర్టు మరో ఐదురోజుల పాటుగా కష్టడీకి అనుమతి ఇచ్చింది.
చిదంబరం అర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలో విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఇందులో కార్తీ చిదంబరం పాత్ర ఉందని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ మేరకు కేసును నమోదు చేసిన సీబీఐ కార్తీ చిదంబరాన్ని అరెస్టు చేసింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *