యడ్యూరప్ప రాజీనామా కు ముందు ఎం జరిగింది…!

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామాలు కు ముందు పలు ఆశక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
1. కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
2. గాలి జనార్థన్ రెడ్డితో పాటుగా ఏకంగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయనవిగా చెప్తున్న ఆడియోను కూడా కాంగ్రెస్
బయటపెట్టింది.
3 గాలిజనార్థన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు శ్రీరాములు, మురళీధర రావు లు కూడా కాంగ్రెస్ సభ్యులను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
4. ఈ పరిణామాల నేపధ్యంలో యడ్యూరప్ప రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
5. బీజేపీ పరువు తీసుకోవడం కన్నా రాజీనామా ఉత్తమమని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.
6. అసెంబ్లీలో మాట్లాడిన తరువాత యడ్యూరప్ప గవర్నర్ ను కలిసి తన రాజీనామాను సమర్పిస్తారనే వార్తలు వస్తున్నాయి.
7. ఢిల్లీలోఉన్న కాంగ్రెస్ అధిష్టానం అనుక్షణం పరిస్థితులను గమనిస్తోంది.
8. వాస్తవ పరిస్థితులను గురించి సోనియా,రాహుల్ లు బెంగళూరులో ఉన్న గునాలం నబీ ఆజాద్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
9. విశ్వాస పరిక్షలో బీజేపీ నెగ్గదని కాంగ్రెస్, జేడీఎస్ లు గట్టి నమ్మకంతో ఉన్నాయి.