గురువును అత్యాచారం, హత్య చేసిన వారికి జీవిత ఖైదు

చదువు చెప్పిన గురువుపైనే అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన నలుగురికి కర్ణాటక కోర్టు జీవిత ఖైదు విధించింది. వీరంతా జీవితాంతం జైల్లోనే ఉండాలంటూ తీర్పు చెప్పింది. తాము చదువుకునే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమెను ఇంటి వద్ద వదుతామని చెప్పి కారు ఎక్కించుకున్న నలుగురు రవి, మంజునాథ్,రవీశ,నరసింహలు ఉపాధ్యాయురాలిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. తమ విద్యార్థులేనని నమ్మి కారు ఎక్కిన ఆమెపట్ల దారుణంగా వ్యవహరించిన నలుగురు వ్యవహరించిన తీరు హేయమైనందిగా న్యాయమూర్తి అభివర్ణించారు. వీరు జీవితాంతం జైల్లోనే ఉండాలంటూ తీర్పు చెప్పారు.
ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన 29 సంవత్సరాల హతురాలు పాఠశాలలో బయాలజీ చెప్పేవారు. 2009 ఆగస్టు 2న ఈ దారుణం జరిగింది.