హైడ్రామా ల మధ్య కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం

కర్ణాటక ముఖ్యమంత్రిగా యూడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. నాటకీయ పరిణామాల మద్య యడ్యూరప్ప పదవీ బాధ్యతలను స్వీకరించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన మూడోసారి పదవీబాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ వాజుభాయి వాలా ఆయనతో ప్రమాణం చేసించారు. రాజ్ భవన్ లో యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. బలనిరూపరణకోసం గవర్నర్ ముఖ్యమంత్రికి 15రోజుల గడువు ఇచ్చారు. బలనిరూపరణ పూర్తయిన తరువాత పూర్తిస్థాయి క్యాబినెట్ ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
కర్ణాటక అసెంబ్లీలో ఏపార్టీకి పూర్తి మెజార్టీ రానిసంగతి తెలిసిందే. 104 సీట్లను సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. దీనిపై కాంగ్రెస్,జేడీఎస్ లు సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో దీనిపై కోర్టు అర్థరాత్రి విచారణ జరిపింది. తీవ్ర వాదోపవాదల తరువాత యడ్యూరప్పను ఆహ్వానించకుండా గవర్నకు ఎటువంటి ఆదేశాలు జారీచేయకపోవడంతో యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా పోయింది.