జనతాదళ్ సెక్యులర్ పాత్ర కీలకం – కర్ణాటలో హంగ్ ?

ప్రస్తుతం దేశం యావత్తు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే దృష్టిని కేంద్రీకరించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలైతే కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నారు. కర్ణాటక పీఠం పై పాగా వేసేందుకు అధికార కాంగ్రెస్-బీజేపీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాజీ ప్రధాని దేవగౌడ నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ చూపుతోంది. కర్ణాటకలో అధికారంపై ఎవరికి వారు ఆశలు పెట్టుకుంటున్నారు.
తాజాగా లోక్ నీతి-సీఎస్ డీఎస్-ఏబీపీ న్యూస్ లు సంయుక్తంగా నిర్వహించిన పోల్ సర్వే ఫలితాలను బట్టి ఆ రాష్ట్రం అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీ కన్నా కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. ఈ సర్వే ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీకి 92-102 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది. బీజేపీకి 79-89 సీట్లు వచ్చే అవకాశం ఉండగా జేడీఎస్ కు 34-42 సీట్లు రావచ్చని సర్వే అంచానా వేసింది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లుండగా 223 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థి మృతి కారణంగా ఒక స్థానంలో ఎన్నికలను వాయిదా వేశారు. కర్ణాటక సీఠాన్ని అధిష్టించడానికి కావాల్సిన కనీస మెజార్టీ 112 సీట్లు.
గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్-బీజేపీలకు దాదాపుగా సమాన స్థాయిలో సీట్లు వస్తాయని అంచానా వేయగా తాగా సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని స్వల్పంగా పెంచుకోగలిగింది. గత సర్వేలో బీజేపీ 89 నుండి 95 స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకుంటుందని అంచానా వేయగా తాజా సర్వే ప్రకారం ఆ పార్టీ బలం కాస్త తగ్గి 79 నుండి 89 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది. ఆదే సమయంలో గత సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 85 నుండి 91 సీట్లు వస్తాయని అంచానా వేయగా ఇప్పుడు 92-102 స్థానాలను కైవసం చేసుకుంటుని అంచానావేస్తున్నారు.
కర్ణాటలో బీజేపీ గట్టి మద్దతుదారులుగా ఉన్న లింగాయత్ లను తమ వైపు తిక్కుకోవడానికి గాను కాంగ్రెస్ పార్టీ వారిని ప్రత్యేక తాయిలాలు ప్రకటించింది. లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తించడంతో పాటుగా వారికి మైనార్టీ హోదాను కట్టబెట్టింది. రాజకీయంగా బీజేపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు సత్పలితాలను ఇచ్చినట్టు కనిపించలేదని సర్వేలో స్పష్టం అయింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ పార్టీకి పెద్దగా ఒరిగింది ఏమీలదని సర్వేలో తేలింది.
ప్రస్తుత సర్వే ఫలితాలను బట్టి కర్ణాటకలో హంగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానిపక్షంలో జనతాదళ్ సెక్యులర్ పార్టీ కీలకంగా మారుతుంది. ఆ పార్టి ఎవరికి మద్దతు ఇస్తే వారు అధికారంలోకి రావడం ఖాయం. జీడీఎస్ తో కమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారంటూ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరో వైపు రెండు పార్టీలు జేడీఎస్ తో ముందుజాగ్రత్తగా మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
కర్ణాటక రాష్ట్ర ఎన్నికలపైనే ఇప్పుడు దేశం మొత్తం ఆశక్తిని చూపుతోంది. బీజేపీ జోరుగు కర్ణాటక బ్రేకులు వేస్తుందా అనే విషయంపై సర్వత్రా ఆశక్తి నెలకొంది. బీజేపీ దూకుడుకు కళ్లేం వేయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. కర్ణాటకలో బీజేపీని నిలువరించడం ద్వారా దేశవ్యాప్తంగా తన ప్రాభావాన్ని తిరిగి చాటేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ అడ్డుకుంటోంది.
దేశవ్యాప్తంగా మోడీ సర్కారు కొంత ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమయంలో కర్ణాటక ఎన్నికల్లో గెలవడం ద్వారా సత్తా చాటేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఈ క్రమంలో కర్ణాటక ను దక్కించుకోవడం ద్వారా దక్షిణాదిలోనూ పాగా వేసేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు మే 15న వెలువడతాయి.
karnataka, karnataka elections, karnataka pool survery, karnataka pool results, karnaka pool survey results, karnataka elections results, karnataka election results in may 15.

జులైనాటికి ఎల్బీనగర్ -అమీర్ పేట మార్గంలోనూ మెట్రో రైలు పరుగులు


vote-for-note