కరీమాబాద్ చేరుకున్న శరత్ మృతదేహం

అమెరికాలోని కన్సాస్‌ నగరంలోని ఒక రెస్టారెంటులో దుండగుడు జరిపిన కాల్పుల్లో చనిపోయిన తెలుగు విద్యార్థి శరత్ మృతదేహం వరంగల్ నగరంలోని కరీమాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకుంది. అమెరికా నుండి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న శరత్ మృతదేహానికి పలువురు నేతలు శ్రద్దాంజలి ఘటించారు. అక్కటి నుండి రోడ్డు మార్గంలో శరత్ మృతదేహాన్ని ఆయన ఇంటికి తరలించారు.
శరత్ ఇంటి పెద్ద సంఖ్యలో స్నేహితులు, బంధువులతో పాటుగా పెద్ద ఎత్తున స్థానిక నాయకులు తరలివచ్చారు. శరత్‌ మృతదేహాన్ని చూసిన వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శరత్‌ను కడసారి చూసేందుకు గ్రామస్థులు, స్నేహితులు తరలివస్తున్నారు.శరత్‌రంగల్‌ నగరం స్వస్థలం వలోని కరీమాబాద్‌. తండ్రి రామ్మోహన్‌ హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగి. తల్లి మాలతి వరంగల్‌ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో పంచాయతీరాజ్‌ శాఖలో ఈవోఆర్డీగా పనిచేస్తున్నారు. రామ్మోహన్‌ కుటుంబంతో హైదరాబాద్‌ అమీర్‌పేటలోని ధరంకరం రోడ్డులో నివసిస్తున్నారు.
మిస్సోరి యూనివర్సిటీలో చదువుకుంటూనే కన్సాస్‌ నగరం ప్రాస్పెక్ట్స్‌ అవెన్యూలోని జేఎస్‌ ఫిష్‌ అండ్‌ చికెన్‌ మార్కెట్‌ అనే ఓ హోటల్‌లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలోనే రెస్టారెంట్ కు వచ్చిన ఓ నల్లజాతీయుడు శరత్ పై కాల్పులకు తెగబడ్డాడు. దీనితో అక్కడే కుప్పకూలిపోయిన ఆయన్ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. రెస్టారెంట్ లోని డబ్బు కోసం దుండగుడు కాల్పులకు తెగబడినట్టు అనుమానిస్తున్నారు. దుండగుడు మొత్తం ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.
శరత్ మృతదేహం చేరుకున్న తరవాత వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతరం అయ్యారు. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా తిరిగిరావడంతో శరత్ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. ఘటన జరగాడానికి కొద్ది సేపటి క్రితం తనతో మాట్లాడాడని భయపడాల్సిన అవసరం లేదని చెప్పాడని ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని శరత్ తండ్రి వాపోయాడు. రెస్టారెంట్ లో దోపిడీకోసం వచ్చి తన కొడుకును బలితీసుకున్నాడండూ భోరున విలపించాడు.
భయం వద్దు
శరత్ మరణంతో అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారని అయితే అటువంటి భయాలు అవసరం లేదని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. శరత్ మృతదేహం అమెరికా నుండి భారత్ కు రప్పించేందుకు కృషిచేసిన దత్తాత్రేయ ఈ విషయంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ తో మాట్లడినట్టు చెప్పారు. అమెరికాలో ఉంటున్న భారతీయుల రక్షణపై భయపడాల్సిన అవసరం లేదని వారి భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు సుష్మ చెప్పారని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
Sharath Koppu, Indian student, an attempted robbery, Kansas City, Rajiv Gandhi International airport, Bandaru Dattatreya,incident of robbery at a restaurant.

ఫైనల్ కు చేరిన క్రోయేషియా


స్వామి పరిపూర్ణానంద కు నగర బహిష్కరణ
Kansas_City,