ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఎంపికకు కారణం అదేనా…!

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనాతాపార్టీ అద్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఎంపికయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కన్నా మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. గుంటూరు జిల్లాకు చెందిన ఈయన 1989 నుండి 2009 వరకు ఓటమి ఎరుగకుండా ఎమ్మెల్యేగా ఎంపికవుతూ వచ్చారు. సామాజిక సమీకరణాలతో పాటుగా పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధినాయకత్వం ఏపీ బీజేపీ నాయకత్వ బాధ్యతలను కన్నాకు అప్పగించినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుండి బయటికి వస్తారని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది.
పార్టీ మారతారనుకునే వ్యక్తికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న హరిబాబు పదవీకాలం ముగిసిన తరువాత కొత్త అధ్యక్షుడి ఎంపికకు బీజేపీ చాలా సమయమే తీసుకుంది. దీని కోసం గాను పార్టీ పెద్ద కసరత్తే చేసింది. పార్టీ అధ్యక్షపదవి కోసం పోటీపడిన కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షపదవి నియామకం మరీ ఆలస్యం అవుతుండడంతో ఏకంగా పార్టీనుండి బయటకుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జరిగింది. దీనితో ఖంగుతిన్న పార్టీ అధినాయకత్వం కన్నాను బుజ్జగించి పార్టీ కు గుడ్ బై చెప్పకుండా ఆపిందని పార్టీ వర్గాల సమాచారం. కన్నాను బుజ్జగించిన తరువాత వివిధ రాజకీయ సమీకరణాల నేపధ్యంలో ఆయనకే పార్టీ పగ్గాలను అప్పగించాలని అమిత్ షా నిర్ణయించారు.
బీజేపీ పార్టీ పరంగా కన్నా లక్ష్మీనారాయణ జూనియర్ పైగా అతనికి ఎటువంటి ఆర్ఎస్ఎస్ పరిచయాలు లేవు. బీజేపీ రాజకీయాలను తెరవెనుక నుండి ప్రభావితం చేసే ఆర్ఎస్ఎస్ మూలాలు లేని వ్యక్తికి ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పదవిని కట్టబెట్టడంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షపదవికి కన్నాతో పాటుగా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఒక దశలో ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన సీబీఐ మాజీ జాయిండ్ డైరక్టర్ లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం కూడా జరిగింది. దీనితో కన్నా మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నారనే సమాచారం బయటికి పొక్కింది. జగన్ పార్టీలో చేరడానికి దాదాపుగా ముహూర్థం ఖరారు కాగా కన్నా అనారోగ్యం కారాణంగానే ఆయన జగన్ పార్టీలో చేరడం ఆలస్యం అయినట్టు సమాచారం. అయితే హఠాత్తుగా పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా నియమిస్తూ అమిత్ షా ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో బలమైన సామాజిక వర్గం కు చెందిన కన్నాకు బలమైన అనుచరగణమే ఉంది. తెలుగుదేశం పార్టీతో సంబంధాలను పూర్తిగా తెగతెంపులు చేసుకున్న బీజేపీని రాష్ట్రంలో ముందుకు నడిపేందుకు బలమైన నాయకుడి అవసరం కనిపిస్తోంది. పార్టీకి ఇంతకాలం పెద్ద దిక్కుగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ప్రత్యక్ష రాజకీయాల నుండి దూరంగా ఉంటుండడంతో పార్టీలో జవసత్వాలు నిపడంతో పాటుగా తెలుగుదేశం పార్టీని బలంగా ఢీకొట్టే సత్తా ఉన్న నాయకుడి కోసం అన్వేషించిన పార్టీ పెద్దలు దీనికి కన్నానే సరైన ప్రత్యామ్నాయంగా భావించినట్టు కనిపిస్తోంది.
మరోవైపు రానున్న ఎన్నికల్లో బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని భావిస్తే ఆ పార్టీతోనూ మంచిసంబంధాలు ఉన్న వ్యక్తిగా కన్నా నియామకం జరిగిందని కన్నా ఎంపికతో రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్-బీజేపీ రెండూ పొత్తు పెట్టుకుంటాయని విషయం తేలిపోయిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
kanna lakshmi narayana, lakshminarayana, kanna, andhrapradesh, andhra pradesh, andhrapradesh bjp, ap bjp president, kanna lakshmi narayana as ap bjp president, ap bjp, tdp, telugudesam party, telugu desam, bharateya janata party, ap bjp, venkaiaha naidu, ap bjp leader, ysr congress, ycp, ys jagan, y.s.jagan.

లో దుస్తులు విప్పించారు – లైగింకంగా వేధించారు : నీట్ విద్యార్థిని అవేదన


అమిత్ షా కాన్వాయ్ పై దాడి