కమల్ తో రజనీ కలుస్తాడా..?

ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం ఇప్పుడు లాంఛనమే. ఎప్పుడైనా కమల్ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయవచ్చు. అయితే కమల్ హాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి రాజకీయాల్లో ముందుకు పోతారా లేక సొంతంగానే పార్టీని ఏర్పాటు చేసుకుంటారా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రజనీ కాంత్ తో కలిసి పనిచేయడానికి తాను సిద్దంగా ఉన్నట్టు కమల్ హాసన్ ప్రకటించినప్పటికీ దీనిపై రజనీ కాంత్ వైపు నుండి ఎటువంటి స్పందనా రాలేదు. ఈ క్రమంలో ఈ ఇద్దరి జోడీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో ఇద్దరు మిత్రులు ఎంజీఆర్, కరుణానిధిలు ఏర్పాటు చేసిన పార్టీ ద్రవిడ పార్టీ తమిళనాట తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ ఇద్దరు కొన్నాళ్లు రాష్ట్రంలో కలిసి చక్రం తిప్పినప్పటికీ వారి మైత్రి ఎక్కువ రోజులు సాగలేదు. ఇద్దరూ ఎవరికి వారుగా విడిపోయినా ఇప్పటికీ వారి పార్టీలే తమిళనాడులో రాజ్యమేలుతున్నాయి.
సినీనటులకు తమిళనాడులో ఉన్న ఆదరణ మన దేశంలో మరెక్కడా కనిపించదు. వారని ప్రత్యక్ష దైవాలుగా పూజించే సంస్కృతి అక్కడ కనిపిస్తుంది. తమిళ రాజకీయాల్లో కూడా సినీ నటుల హవా అంతా ఇంతా కాదు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినీ రంగం నుండి వచ్చి తమిళరాజకీయాలను ఏలినవాళ్లే. ప్రస్తుతం తమిళనాడుతో పాటుగా దేశవ్యాప్తంగా కమల్ హాసన్, రజనీ కాంత్ ల జోడీపై ఆశక్తి నెలకొంది. వీరిద్దరు కలిసి తమిళనాడులో చక్రం తిప్పుతారని వారి అభిమానులు ఆశిస్తున్నారు.
ఏళ్ల తరబడి ఇదిగో అదిగో అంటూ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి సూపర్ స్టార్ రజనీ కాంత్ ఊరిస్తునే ఉన్నారు. రాజకీయా ప్రవేశం పై నేరుగా ఎటువంటి ప్రకటనా చేయకున్నా ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల ద్వారా రజనీ రాజకీయాల్లోకి రావడం ఖాయమనే ప్రచారానికి బలం చేకూర్చేవిధంగా ఉంది. ప్రస్తుతం తన మనసులోని మాటను కమల్ హాసన్ బయట పెట్టినప్పటికీ రజనీ కాంత్ మాత్రం దీని పై ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఇద్దరూ రెండు భిన్న దృవాలకు చెందిన వారని వారిద్దరి జోడి అంతగా సక్సెస్ కాదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *