తెలంగాణ రాష్ట్ర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. దీనితో శరవేగంగా జరుగుతున్న ప్రాజెక్టు పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా పోయింది. ప్రర్యావరణ అనుమతులను ప్రశ్నించడంతో పాటుగా ముంపు గ్రామాల్లోని ప్రజలకు సరైన ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించకుండా ప్రాజెక్టును నిర్మిస్తున్నారంటూ దాఖలైన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు విచారణకే ఆర్హత లేదని కోర్టు స్పష్టం చేసింది. చెన్నై బెంచ్ నుండి ఢిల్లీకి రావడం పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒకచోట కాకాపోతే మరో చోట కేసువేయండంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటీషన్ దారుడిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.