జియో ఫ్రీ ఫోన్ బుకింగ్ ఆగస్టు 24 నుండి

0
36

టెలికాం రంగంలో సంచలనం రేపుతున్న జియో ఉచితంగా మొబైల్ ఫోన్ ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన బుకింగ్ లు ఆగస్టు 24వ తేదీ నుండి మొదలు కానున్నాయి. ఫోన్ ఉచితంగానే ఇస్తున్నప్పటికీ ప్రతీ వినియోగదారుడి నుండి 15 వందల రూపాయలు వసూలు చేస్తున్నట్టు జియో ప్రకటించింది. ఈ పదిహేను వందల రూపాయలను మూడు సంవత్సరాల తరువాత తరువాత తిరిగి ఇచ్చేస్తామని జియో ఇప్పటికే ప్రకటించింది. 15 వందల రూపాయలకే స్మార్ట్ ఫోన్ అంటూ ప్రకటించడంతో దీనికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ ఫోన్ల కోసం ఆగస్టు 24 నుండి బుకింగ్ ప్రారంభించనున్నట్టు జియో ప్రకటించింది.
*జియో పోన్ ను ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు.
*జియో ఫోన్ ను బుక్ చేసుకునేందుకు ఆధార్ కార్డు కావాలి.
*ఒక కార్డు పై ఒక ఫోన్ ను మాత్రమే ఇస్తారు.
*జియో అవుట్ లెట్లు లేదా అధికారిక జియో ఫోన్ల విక్రయ కేంద్రాల్లో ఫోన్ల్ కోసం నమోదు చేసుకోవచ్చు.
*ఆన్ లైన్ లో కూడా జియో పోన్ ను అప్లై చేసుకోవచ్చు.
*ఆన్ లైన్ లో అప్లై చేయడం కోసం jio.com, jiofreephone.org లలో అప్లై చేసుకునే అవకాశం.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here