బయటికి వచ్చిన జయలలిత ఆస్పత్రి దృశ్యాలు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు ఇప్పుడు బయటికి వచ్చాయి. ఆమె మరణించిన సంవత్సరం తరువాత జయలలితకు సుబంధించిన దృశ్యాలు వెలుకు చూశాయి. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన జయలలిత ను చూసేందుకు శశికళ వర్గం ఎవరినీ అనుమతించని సంగతి తెలిసిందే. జయలలిత మరణంపై ఆమె బంధువులతో సహా పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు విచారణ కూడా జరుగుతోంది. జయలలిత మరణంతో ఆర్కే నగర్ శాసనసభా స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. అక్కడ పోలింగ్ కు ఒక్క రోజు ముందు శశికళకు దగ్గరి బంధువు దినకరన్ వర్గం జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను విడుదల చేసింది.