అమెరికాలో భారత ఐటి నిపుణులకు అవకాశాలు తగ్గిపోతున్నాయంటూ వస్తున్న వార్తలు ఆ రంగానికి చెందిన వారిని కలవరపెడుతున్న సమయంలో జపాన్ ఐటి రంగ నిపుణులకు చల్లటి వార్తను అందించింది. ఐటి రంగానికి జపాన్ లో పుష్కలంగా అవకాశాలు ఉన్నట్టు ఆ రంగానికి చెందిన నిపుణలు చెప్తున్నారు. ఇప్పిటికిప్పుడు జపాన్ రెండు లక్షల మంది ఐటి నిపుణలకు డిమాండ్ ఉంది. ఇది క్రమంగా మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. జపాన్ లో ఇప్పటివరకు 9లక్షల మందికి పైగా ఐటి నిపుణలు ఉన్నారని అంచానా. దేశంలో ఐటి నిపుణులకు తీవ్ర కొరత ఉండడంతో భారత్ నుండి పెద్ద సంఖ్యలో ఐటి నిపుణులను తమ దేశానికి రప్పించుకునే అవకాశాలు ఉన్నాయి.
ఐటి నిపుణుల కొరతను ఎదుర్కొనేందుకు జపాన్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. జపాన్ లో స్థిరపడాలనుకునే ఐటి రంగానికి చెందిన నిపుణులకు గ్రీన్ కార్డును ఇచ్చేందుకు ఆ దేశం సిద్దంగా ఉంది. తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న జపాన్ ఐటిలో కొంత వెనుకబడే ఉంది. ఈ సమస్యను అధికమించేందుకు దేశవ్యాప్తంగా కర్మాగారాలను ఆధునీకరించే పనిలో ఉన్న జపాన్ కు ఐటి నిపుణుల అవసరం ఎక్కువయింది.
జపాన్ లో వేతనాలు కూడా అమెరికాతో సమానంగా వచ్చే అవకాశాలున్నాయి. అయితే సంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇచ్చే జపాన్ లో స్థిరపడేందుకు మన ఐటి నిపుణలు ఎంతవరకు మెగ్గు చూపిస్తారో చూడాలి.