గుజరాత్ సీఎంగా ఇరానీ?

గుజరాత్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని ఎంపికచేసేందుకు ఏర్మాట్లు జరుగుతున్నయాని ప్రచారం జరుగుతోంది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ మెజార్టీ భారీగా తగ్గడం పై ఆత్మపరిశోధనలో పడిన పార్టీ అధిష్టానం ప్రస్తుత సీఎం విజయ్ రూపానీ పనితీరుపై పెదవి విరుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ పీఠం పై ప్రజాకర్షక నేత స్మృతీ ఇరానీని కూర్చోబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేత ఇరానీని గుజరాత్ కు పంపడం ద్వారా నాయకత్వ సమస్యను అధికమించాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇరానీ రాజ్యసభకు గుజరాత్ నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముంబాయికి చెందిన ఇరానీ గుజరాతీని అనర్గళంగా మాట్లడగలరు. గుజరాత్ వ్యాప్తంగా ఇరానీకి మంచి గుర్తింపుతో పాటుగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన ఇరానీ అయితేనే కాంగ్రెస్ పార్టీ దుకుడును ఎదుర్కోగలరని భావిస్తున్న బీజేపీ అధిష్టానం ఆదిశగా ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
గుజరాత్ ఎన్నిక్లలో బీజేపీ సాధించిన విజయం కేవలం ప్రధాని మోడి వల్లే సాధ్యమైందని భావిస్తున్న పార్టీ పెద్దలు ఇప్పుడు రాష్ట్రంలో బలమైన నేతను ముఖ్యమంత్రిగా నిలమించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మోడి ఛరిష్మా వల్లనే బీజేపీ ఎన్నికల్లో గట్టెక్కిందని స్థానిక బీజేపీ నేతలు పూర్తిగా విఫలం అయ్యారనేది అధిష్టానం భావన. దీనితో పాటుగా ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపాని పనితీరుపై పార్టీ వర్గాల్లోనూ అసంతృప్తి ఉంది. విటన్నింటిని దృష్టిలో పెట్టుకుని గుజరాత్ ఫీఠం పై ఇరానీని కూర్చొబెట్టాలనే దిశగా పార్టీలోని పెద్దలు భావిస్తున్నారని ఢిల్లీ వర్గాల కథనం.
అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాత్రం విజయ్ రూపానీ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కొత్త సీఎంను తీసుకుని రావడం వల్ల లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇరానీ గుజరాత్ కు చెందిన వారు కాకపోవడం కూడా ఇందుకు ఒక కారణంగా తెలుస్తోంది. ఆమె మొదటి నుండి ముంబాయిలోనే ఉన్నారని ఆమె మూలాలు కూడా గుజరాత్ కు చెందినవి కాకపోవడం వల్ల స్థానికేతర సమస్య వస్తుందని భావిస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *