తెలంగాణలో ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాల వెల్లడి?

తెలంగాణలో ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాల వెల్లడిపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. హైకోర్టు ఇచ్చిన గడువు ఈరోజు సాయంత్రం 5 గంటలకే ముగిసినప్పటికీ ఇంటర్‌బోర్డు అధికారులు ఫలితాలను ఇంకా విడుదల చేయలేదు. ఫలితాల కోసం ఉదయం నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఫలితాల వెల్లడిపై ఇంటర్‌బోర్డు అధికారులు ఇంతవరకూ స్పష్టత ఇవ్వలేదు. అధికారిక వెబ్‌సైట్‌లో ‘Updated Soon’ అనే వస్తోంది.

ఇటీవల నిర్వహించిన తెలంగాణ ఇంటర్‌ పరీక్షల్లో 3,82,116 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరందరి ఫలితాలను ఇంటర్‌బోర్డు రీవెరిఫికేషన్‌ చేయించింది. అందులో 92,429 మంది విద్యార్థుల సమాధాన పత్రాలను అధికారులు ఫునఃమూల్యాంకనం చేశారు. ఆ ఫలితాలను ఇప్పుడు వెల్లడించాల్సి ఉంది.
Telangana Inter results : A brief till date