దేశంలోనే సంపన్న ఎంపీ ఎవరో తెలుసా

మనదేశంలోని పార్లమెంటేరియన్లలో చాలామంది కోటీశ్వరులున్నారు. వందలకోట్లకు అధిపతులున్నారు. వీరందరిలోనూ ఎక్కువ సంపన్నులు ఎవరో తెలుసా…? తాజగా దేశంలోని పార్లమెంటు సభ్యులందరిలోనూ ఎక్కువ సంపన్నురాలిగా బిగ్ బి అమితాబ్ భార్య జయాబచ్చన్ నిల్చారు. ఉత్తర్ ప్రదేశ్ నుండి రాజ్యసభకు పోటీచేస్తున్న జయాబచ్చన్ తన ఆస్తులను ప్రకటించారు. దీని ప్రకారం అమె ఆస్తుల విలువ వేయికోట్ల రూపాయలు. వీటిలో 460 కోట్లు స్థిరాస్తులు కాగా 540కోట్ల చరాస్తులున్నట్టు జయాబచ్చన్ తన అఫడవిట్ లో పేర్కొన్నారు. దీనితో ఆమె అత్యంత సంపన్న ఎంపీగా మారారు. ఇప్పటివరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ కిశోర్ సిన్హా రెండో స్థానానికి పడిపోయారు.
ఉత్తర్ ప్రదేశ్ నుండి రాజ్యసభకు సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీచేస్తున్నారు. ప్రస్తతం ఎంపీగా ఉన్న అమెకు మరోదఫ రాజ్యసభకు పంపాలని సమాజ్ వాదీ పార్టీ తీసుకున్న నిర్ణయం అటు పార్టీలోనూ కొంత అలజడి రేపిన సంగతి తెలిసిందే.
జయాబచ్చన్ రికార్డు ఒక్కరోజులోనే బద్దలయిపోయింది. బీహార్ నుండి రాజ్యసభకు నామినేషన్ వేస్తున్న ఆర్జేడీ అభ్యర్థి మహేంద్ర ప్రసాద్ అలియాస్ కింగ్ మహేంద్ర ఏకంగా నాలుగువేలకోట్ల రూపాయల ఆస్తిని ప్రకటించారు. కింగ్ మహేంద్ర ఎన్నికల్లో గెలిస్తే ఆయనే అత్యంత ధనవంతుడైన పార్లమెంటు సభ్యుడు కానున్నారు.

jaya bachchan, amitab bachan, amitabbachan,samajwadi party, samajwadi,sp,rajya sabha, rajya sabha mp, most richest mp of india.