పాక్ సైనిక స్థావరాలనుపై విరుచుకుపడ్డ భారత్

0
87

భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీగా కాల్పులు జరుగుతున్నాయి. నియంత్రణకు రేఖకు ఇరువైపులా పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ కు భారత్ గట్టిగానే బదులు చెప్పింది. గత కొంతకాలంగా సంయవనం పాటిస్తూ వచ్చిన భారత బలగాలు భారీ ఎత్తున శత్రువుల శిభిరాలవైపు కాల్పులు జరిపాయి. పూంచ్ జిల్లా మేందార్ సెక్టార్ లో భారత బలగాలు శతృస్థావరాలపై విరుచుకుని పడ్డాయి. ఈ కాల్పుల్లో పాకిస్థాన్ కు చెందిన సైనిక స్థావరాలు ధ్వంసం అయినట్టు సమాచారం. మెషిన్ గన్ లతో పాటుగా మోర్టార్ లను ఉపయోగించి భారత బలగాలు కాల్పులు జరిపాయి.
భారత భూబాగంలోకి ఉగ్రవాదులను పంపడానికి అనువుగా ఉండేందుకు గాను పాకిస్థాన్ సైన్యం తరచూ సరిహద్దుల్లో కాల్పులకు దిగుతోంది. భారత సైనికుల దృష్టిని మరల్చడం ద్వారా ఉగ్రమూకలను భారత్ లోకి పంపుతోంది. ఈ ప్రయత్నాలను భారత బలగాలు అడ్డుకుంటున్నాయి. పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం జరిపిన కాల్పుల ధాటికి పాకిస్థాన్ సైనిక స్థావరాలు ధ్వసం అయినట్టు సమాచారం. ఈ కాల్పులకు సంబంధించి ఇటు భారత్ కానీ అటు పాకిస్థాన్ కానీ ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here