పాక్ సైనికుల స్థావరాలపై భారీగా కాల్పులు జరిపిన భారత్

పాకిస్థాన్ పై భారత సైన్యం విరుచుకు పడింది. పాక్ సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో ముగ్గురు పాకిస్థానీ రేంజర్లు మరణించినట్టు తెలుస్తోంది. భారత్ ఇంతవరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అధితే విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం శనివారం నుండి పాకిస్థాన్ పాల్పుల విరణ ఒప్పందాన్ని ఉల్లంఘింటి పలుసార్లు భారత్ భూబాగంపై కాల్పులు జరిపింది. పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు అమరులయ్యారు. పలువురు పౌరులకు గాయాలయ్యాయి. పాకిస్థాన్ చర్యలకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ బంకర్లను లక్ష్యంగా చేసుకుని భారీగా కాల్పులకు దిగింది. ఇందులో ముగ్గురు సైనికులు మరణించినట్టు సమాచారం.
సరిహద్దుల్లో ఇరు దేశాల సనికులు కాల్పులకు దిగకుండా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇరు దేశాలకు చెందిన సైనికులు కాల్పులకు దిగకూడదు అయితే పాకిస్థాన్ తరచూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. వందల సార్లు భారత భూభాగంపైకి కాల్పులు జరుపుతూనే ఉంది. దీనికి భారత బలగాలు ధీటుగానే జవాబు చెప్తున్నాయి. తరుచు జరుగుతున్న కాల్పుల మన వీర జవాన్లు అమరవుతూనే ఉన్నారు. అఖస్మాత్తుగా పాకిస్థాన్ సైన్యం కాల్పులకు దిగుతోంది.