దేశంలోని వేతన జీవులు పెట్టుకున్న ఆశలు తీరలేదు. ఆదాయపు పన్ను పరిధిని పెంచుతారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. ఆదాయపు పన్ను పరిమితిలో ఎటువంటి మార్పులేదు. అయితే మెడికల్ బెనిఫిట్స్ లో మాత్రం 40వేల వరకు రాయితీని కల్పించారు. ఆదాయపపు పన్ను పరిమితిని పెంచుతారంటూ జరిగిన ప్రచారం ఉత్తిదేనని తేలిపోయింది. వేతన జీవులు బడ్జెట్ లో జైట్లీ తీపి కబుర చెప్తారేమోనని ఎదురు చూపులు చూసినా ప్రయోజనం లేకుండా పోయింది.