ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఐఏఎఫ్ కమెండోలు మృతి

తీవ్రవాదుల తూటాలకు ఇద్దరు భారత వైమానిక దళ కమాండోలు బలయ్యారు. జమ్ము కాశ్మీర్ లోని బండిపురా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎదురు కాల్పుల్లో వైమానిక దళ కమాండోలు మృతి చెందడం ఇదే మొదటి సారి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు కరడుగట్టిన తీవ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు దాడులు జరుపుతున్నప్పటికీ తీవ్రవాదు ఏరివేత కార్యకలాపాల్లో ఎప్పుడూ వైమానిక కమెండోలు పాల్గొనలేదు. వైమానిక దళానికి చెందిన ప్రతిష్టాత్మక ‘గరుడ’ కు చెందిన కమెండోలు తీవ్రవాదులతో జరగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.
తీవ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో జమ్ముకాశ్మీర్ పోలీసులు, సైనిక దళాలతో పాటుగా వైమానిక దళానికి చెందిన గరుడ కమెండోలు సంయుక్తంగా గాలింపు జరుపుతుండగా ఒక్కసారిగా తీవ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు కాల్పులు జరపి ఇద్దరు తీవ్రవాదులను మట్టుపెట్టగా ఇద్దరు కమెండోలు అమరులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *