జంట పేలుళ్ల కేసులో ఇద్దరికి మరణశిక్ష

hyderabad twin blasts 2007లో జరిగిన ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోగా వంద మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ కేసులో విచారణను ఎదుర్కొన్న అనీఖ్, ఇస్మాయిల్ లకు ఉరిశిక్ష విధించిన కోర్టు ఇదే కేసులో ముద్దాయి గా ఉన్నా తారిక్ అంజున్ కు జీవిత ఖైదు విధించింది. 2007 ఆగస్టు 25వ తేదీ నాడు గోకులు ఛాట్ , లుంబినీ పార్క్ ల వద్ద బాంబులు పెట్టిన దుర్మార్గులు 44 మంది జీవితాలను బలిగొన్నారు. మరెంతమందో గాయపడి నేటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఈ తీవ్రవాదులు భారీగా ప్రాణనష్టం కలిగించాలనే లక్ష్యంతో రెండు ప్రాంతాల్లోనూ బాంబులు పెట్టారు. భారీగా ప్రాణనష్టం కలిగించాలనే దురుద్దేశంతోనే వీరు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాకిక్యూన్ రుజువు చేయడంతో ఇద్దరికి మరణశిక్షను విధించింది. పేలుళ్లకు పాల్డిన వ్యక్తులకు ఆశ్రయం కల్పించడంతో పాటుగా వారికి సహకరించినందుకు గాను మరొకరికి జీవిత ఖైదు విధుస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
తాము అమాయకులమని తమని పోలీసులే ఈ కేసులో ఇరికించారంటూ దోషులు కోర్టులో వాదించారు. అయితే పోలీసులు పక్కా ఆధారాలు సమర్పించడంతో ఇద్దరికి మరణ శిక్ష పడగా మరొకరికి జీవిత ఖైదు విధించారు.

అమ్మాయిల బాత్రూంలలో రహస్య కెమేరాలు


Troubling worms in little tummy
Hyderabad_bombings