హైదరాబాద్ పాతబస్తీ లో చికెన్ కోసం హత్య | murder for chicken

హైదరాబాద్ పాతబస్తీ లో చిన్న విషయంపై జరిగిన గొడవ ఒకరి హత్యకు దారితీసింది. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని షాగంగ్ లో చికెన్ కోసం జరిగిన వివాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇట్లా ఉన్నాయి.
హైదరాబాద్ పాతబస్తీలోని హరేహత్ మంజిల్ షాదీ ఖానాలో ఎంగేజ్ మెంట్ వేడుకలు జరుగుతున్నాయి. దీనికి హాజరైన అశ్వాక్ అనే వ్యక్తి తనకు చికెన్ సరిగా వడ్డించడం లేదని వడ్డన చేస్తున్న అన్వర్, అన్వర్ సోహైల్ లతో వాగ్వాదానికి దిగాడు. వీరి మధ్య వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారింది. అశ్వాక్ తో అన్వర్, అన్వర్ సోహైల్ లు గొడవకు దిగారు.
గొడవ ముదరడంతో ఫంక్షన్ కు వచ్చిన వారు సర్థిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. అయితే అశ్వాక్ తన మిత్రులకు ఫోన్ చేసి గొడవ విషయం చెప్పడంతో అక్కడికి వచ్చిన అశ్వాక్ మిత్రులు అన్వర్, అన్వర్ సోహైల్ తో గొడవకు దిగారు. అశ్వాక్ మిత్రబృందంలోని ఒకరు కత్తితో అన్వర్ ను పొడవడంతో అతను కుప్పకూలిపోయాడు. అన్వర్ సోహైన్ వీపు పై కత్తిపోట్లు పడ్డాయి.
గాయపడ్డవారిని హుటుహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడ అన్వర్ చనిపోయాడు. అన్వర్ సోహైల్ చికిత్స జరుగుతోంది. అన్వర్ ను కడుపులో పొడవడంతో చనిపోయినట్టు డాక్టర్లు చెప్తున్నారు.
కత్తితో పొడిచి పారిపోయిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ అజయ్య వెల్లడించార. హుస్సేనీఆలం పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కేవలం చికెన్ వడ్డించలేదనే చిన్న విషయం ఒకరి హత్యుకు దారితీయడం స్థానికంగా కలకలం రేపింది.
hyderabad, hyderabad old city, old city, hyderabad old city, hussaini alam, hyderabad police,
హైదరాబాద్ స్కూల్ పిల్లలు
హైదరాబాద్
చార్మినార్
hyderabad old city
Makkah_Masjid,_Hyderabad