హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరిని దోషుగా ప్రకటించిన కోర్ట్

hyderabad blast case హైదరాబాద్ లో 11 సంవత్సరాల క్రితం జరిగిన జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇద్దరిని దోషులుగా తేల్చింది. 2007 ఆగస్టు 25 తేదీ సాయంత్రం సెక్రటేరియట్ సమీపంలోని లుంబినీ పార్క్ తో పాటుగా కోఠిలోని గోకుల్ ఛాట్ వద్ద బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులు ఈ దారుణానికి తెగబడినట్టు దర్యాప్తు బృందాలు నిర్థారించాయి. 11 సంవత్సరాలుగా కేసు విచారణ జరుగుతోంది. ఇందులో ఏ-1, ఏ-2గా ఉన్న అక్బర్ ఇస్మాయిల్, అనీక్ సయిద్ లను ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్థారించింది. వీరికి వచ్చే సోమవారం శిక్షలు ఖరారు చేయనున్నారు. మరో ఇద్దరు నిందితులను కోర్టు నిర్థోషులుగా విడుదల చేసింది. వారు నేరానికి పాల్పడినట్టుగా ఎటువంటి ఆధారాలు లేనందున వారిపై పెట్టిన కేసులను కొట్టివేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.
hyderabad blast case, hyderabad blast.