హాంకాంగ్,చైనాల్లో హరికేన్ విధ్వంసం వీడియోలు చూడండి

0
123

భారీ హరికేన్ “హటో” దెబ్బకు మకావు, హాంకాంగ్ లు విలవిల్లాడాయి. ఈ భారీ హరికేన్ భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ పెను తుఫాను వల్ల ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 70 మందికి పైగా గాయాలయ్యాయి. హరికేన్ పై ముందుగానే సమాచారం అందడంతో భారీ ప్రాణనష్టం తప్పినప్పటికీ పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగింది. హరికేన్ తీరం దాటే సమయంలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. బలంగా వీచిన గాలులకు భారీ భవనాలు కూడా చిగురుటాకుల్లా వణికిపోయాయి. బస్సులు సైతం తిరగబట్టాయి. హరికేన్ భీబత్సానికి సంబంధించిన వీడియోలు చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోంది.
చైనా లోని మకావు తో పాటుగా హాంకాగ్ ను వణికించిన హరికేన్
పెను విధ్వంసం సృష్టించిన పెను తుపాను
భారీ గాలులకు తిరగబడ్డ భారీ వాహనాలు
కూలిన స్థంబాలు, చెట్లు
కుప్పకూలిన ఇళ్లు
విధ్వంసాన్ని కళ్లకు కట్టిన వీడియోలు
ముందే ప్రజలను అప్రమత్తం చేయడంతో తప్పిన భారీ ప్రాణనష్టం
20 మందిని బలిగొన్న పెను తాపాను
దాదాపు 70 మందికి గాయాలు
భారీగా ఆస్తినష్టం
సహాయక చర్యల్లో మునిగిన హాంకాంగ్, చైనా ప్రభుత్వాలు
భారీ ఎత్తున పునరావాస ఏర్పుట్లు
చైనాలో రంగంలోకి దిగిన సైన్యం
అనేక ప్రాంతాల్లో నిరాశ్రయులుగా మారిన ప్రజలు
దెబ్బతిన్న ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున ఆహారం, మందుల సరఫరా
దెబ్బతిన్న మౌళిక వసతులు
గాడిలో పడేందుకు మరింత సమయం పట్టే అవకాశం.Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here