1950 జనవరి 26న భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం గా అవతరించింది. భారత్ కు స్వాతంత్ర్యం రాక ముందే రాజ్యంగ నిర్మాణ ప్రకియ ప్రారంభం అయింది. దీని కోసం గాను గాను రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు.
- రాజ్యాంగ సభలో మొత్తం 389 మంది సభ్యులు ఉన్నారు.
- శాసనసభల ద్వారా ఎంపికైన వారు 292, భారత్ సంస్థాల నుండి 93 మంది, చీఫ్ కమిషనర్ ప్రావిన్సుల నుండి 4 మొత్తం 389 మంది.
- దేశవిభజన వల్ల మొత్తం సభ్యుల సంఖ్య 299కి తగ్గింది.
- రాజ్యాంగ సభ మొదటి సమావేశం పార్లమెంటు సెంట్రల్ హాల్ లో 1946 డిసెంబర్ 9న జరిగింది.
- ఈ సభకు డా.సచ్చిదానంద సిన్హా అధ్యక్షత వహించారు.
- రాజ్యంగ సభలో జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ పటేల్,బి.ఆర్.అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య , ఆచార్య జె.బి.కృపలానీ, డా.రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, రాజాజీ, సభ్యులుగా ఉన్నారు.
- 1947 ఆగష్టు 29 న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్టు కమిటీని ఏర్పాటు చేసింది. డా.బి.ఆర్.అంబేద్కర్ ఈ కమిటీకి అధ్యక్షుడు.
- రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది.
- స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన సమయం 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు.
- భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు.
- 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యంగ సభ ఆ రోజున రద్దయినా ఈ సభ్యులు తాత్కాలిక భారత పార్లమెంటు సభ్యులుగా వ్యవహరించారు. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికలు దాకా ఈ పార్లమెంటే అమల్లో ఉంది.