చలి చక్కిలిగింతలు లేవు… అక్కడా మండే ఎండలే…

ఎండలు మండిపోతున్నాయి, ఎండలు 40 డిగ్రీలను దాటిపోతున్నాయి. ఎండలకు తట్టుకోలేక ఏదైనా హిల్ స్టేషన్ కు వెళ్తామని ప్లాన్ చేసుకుంటున్నారా… ఐతే ఒక్క క్షణం ఆగండి…వేసవిలో కూడా చల్లగా ఉండే హిల్ స్టేషన్లలో కూడా ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా హిల్ స్టేషన్లలో కూడా వేసవి తాపం ఎక్కువయింది. సాధారణం కన్నా 8 నుండి 10 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కన్నా ముడు నుండి నాలుగు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయినా దాన్ని అసాధరణంగా వాతావరణ శాఖ పేర్కొంటుంది. అట్లాంది సాధారణం కాన్నా ఏకంగా ఎనిమిది నుండి పది డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడం కలవరపరుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లోని ప్రఖ్యాత హిల్ స్టేషన్లు కులు, మనాలి లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కులులో 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. ఎండకాలంలోనూ చలిగాలులతో గిలిగింతలు పెట్టే కులులో నమోదయిన ఉష్ణోగ్రతలు కలవరపెడుతున్నాయి. ఒక్క కులునే కాదు హిమాచల్ రాజధాని సిమ్లాలోనూ ఇదే పరిస్థితి. ఉత్తరా ఖండ్ లోని ముక్తేశ్వర్, డేహరాడూన్ లలో కూడా ఎండ మండిపోతోంది. జమ్మకాశ్మీర్ లోని పెహల్ గావ్ తో పాటుగా శ్రీనగర్ ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.
దేశవ్యాప్తంగా దాదాపు అన్ని హిల్ స్టేషన్లలోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడం కలవరపెడుతోంది. ఎప్పుడూ చల్లగా ఉండే ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో స్థానికులు బెంబేలు ఎత్తుతున్నారు. అటు వేసవిలో పర్యాటకుల పై ఈ ఎండల ప్రభావం ఉంటుందని భయపడుతున్నారు. ప్రతీ వేసవిలో ఈ ప్రాంతాలు పర్యాటకులతో కిటకిట లాడుతుంటాయి. పర్యాటకులతో కళకళలాడాల్సిన ఈ హిల్ స్టేషన్లను మండిస్తున్న ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. దీని ప్రభావం పర్యాటకరంగం మీద తప్పకుండా పడుతుందని ఆ రంగంపై ఆధారపడిన వారు భయపడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో పెరిగిన ఎండల వల్ల వచ్చిన పర్యాటకులు తమ పర్యటనను కుదించుకుని వెళ్లిపోతున్నారని వారు చెప్తున్నారు. ఇదే పరిస్థితులు కొనసాగితే తమ వ్యాపారం దారుణంగా దెబ్బతింటుందని వారంటున్నారు.
ఎప్పుడు చల్లగా ఉండే ప్రాంతాల్లో మండే ఎండలు ఎందుకు పెరిగిపోతుండడం పై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిల్ స్టేషన్లలో విచ్చలవిడిగా చెట్ల నరికివేతతో పాటుగా మితిమీరిన కాలుష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *