ప్రాజెక్టులను అడ్డుకునేవారికి బుద్దిచెప్తాం:హరీష్ రావు

0
72

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మంత్రి హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు కొంతమందికి చెంపపెట్టులాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే తీర్పుకు సంబంధించిన వివరాలను హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు. అనంతరం హరీష్ మీడియాతో మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడం ఆనందంగా ఉందన్నారు. కొంత మంది పనిగట్టుకుని ప్రాజెక్టుల పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టులను అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులను నిలువునా ముంచేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలను కోర్టు అడ్డుకుందని న్యాయం గెలిచిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
చౌకబారు రాజకీయాలతో ప్రాజక్టులు కట్టనీయంకుండా అడ్డుకుని రైతుల ఉసుపు పోసుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలే గట్టి బుద్దిచెప్తారని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వందకు పైగా కేసులు వేసి ప్రాజెక్టును కట్టకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఏయో నాయకులు వెనకనుండి ప్రాజెక్టులపై కేసులు వేయించిన సంగతి తనకు తెలుసునని సరైన సమయంలో వారి వివరాలను బహిర్గతం చేస్తానని హరీష్ రావు వివరించారు.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here