హజ్ యాత్రికులకు రాయితీ కట్

0
51

ముస్లీంల పుణ్యక్షేత్రాలు మక్కా,మదీనాలను దర్శించుకునేందుకు గాను ముస్లీంలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్రికులకు ఇస్తున్న రాయితీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. హజ్ యాత్రికులకు రాయితీని ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. చాలా కాలంగా హజ్ యాత్రికులకు ఇస్తున్న రాయితీ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హజ్ యాత్ర పేరుతో ప్రజా ధనాన్ని ఖర్చుచేయడంపై పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హజ్ యాత్రికులకు రాయితీలు ఉపసంహరించుకోవడం ద్వారా ప్రతీ సంవత్సరం 700 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. ఈ మొత్తాన్ని ముస్లీం బాలికల చదువుకోసం ఖర్చుచేయనున్నారు.
హజ్ యాత్ర కోసం ఈ సంవత్సరం భారత్ నుండి 1.75 లక్షల మంది వెళ్తున్నారు. వీరికి ఎటువంటి రాయితీని ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎటువంటి రాయితీలు లేకుండా హజ్ కు బయలుదేరుతున్న మొదటి బృందం ఇదే కానుంది. భారత్ నుండి మగవారు ఎవరూ తోడు లేకుండా 13 వందల మంది హజ్ యాత్రను చేపట్టనున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here