పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 25 మంది మృతి చెందగా అనేక మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో 60మందికి పైగా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ దుర్ఘటన గుజరాత్ లో జరిగింది. పెళ్లి బృందానికి చెందిన ట్రకు భావ్ నగర్ సమీపంలోని రంగేలా వంతెనపై అదుపు తప్పి కిందపడిపోయింది. అంత ఎత్తు నుండి ట్రక్కు కిందపడిపోవడంతో అందులో ఉన్న వారిలో పాతికమంది ఘటనా స్థలంలోనే చనిపోగా చాలా మందికి గాయాలయ్యాయి. కొంత మంది నాలాలో పడిపోవడంతో వారి మృత దేహాలను వెలికితీయడం కూడా కష్టంగా మారింది. మృతదేహాలు, గాయపడ్డ వారితో ఆప్రాంతం అంతా బీదావాహ వాతావరణం నెలకొంది.
పోలీసులు సహాయక బృందాలకు ఘటనా స్థలికి చేరుకున్నాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. కొంత మందికి ఘటనా స్థలంలోనే అంబులెన్స్ లలోనే చికిత్స చేస్తున్నారు.