గుజరాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు…

బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన బీజేపీలో తిరిగి కాషాయ జెండా రెపరెప ఖాయమని తెలుస్తోంది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో చివరిదశ ఎన్నికలు పూర్తయ్యాయి. గుజరాత్ పీఠం కోసం జరిగిన హోరాహోరీ పోరులో బీజేపీనే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ బీజీపీ 100 నుండి 108 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ ఫోల్ ఫలితాల ద్వారా అంచానా వేస్తున్నారు. గుజరాత్ లో పాగా వేసేందుకు శాయశక్తులా ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ ఆశలు ఈ సారి కూడా నెరవేరే సూచనలు కనిపించడం లేదు ఆ పార్టీ 70 నుండి 78 సీట్లకే పరిమితం కానుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకున్నట్టు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
ఈ ఉదయం నుండి గుజరాత్ లో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి లాంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాని మోడి సామాన్య ఓటర్లు మాదిరిగా క్యూలైన్ లో నిల్చుని ఓటు హక్కును వినియోగించుకున్నారు.