విడివిడిగా ముగ్గురు యువతులను పెళ్లాడిన మరో యువతి

ఒక యువతి మరో ముగ్గురు యువతులను పెళ్లిచేసుకున్న వైనం కడప జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన ఒక యువతి అబ్బాయి వేషం వేసుకుని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తరువాత వరుడు అసలు పురుషుడే కాదనే సంగతి బయటికి వచ్చింది. దీనిపై ఆ యువతి బంధువులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులకు ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. అబ్బాయి వేషంలో యువతిని పెళ్లిచేసుకున్న ఇదే అమ్మాయి గతంలోనూ ఇద్దర్ని ఇదేతరహాలు పెళ్లిచేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. పైగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న కిలాడీలేడీకి 18 సంవత్సరాలు కూడా నిండలేదని పోలీసులు చెప్తున్నారు. మోసానికి పాల్పడిన అమ్మాయి మైనర్ గా పోలీసులు చెప్తున్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.