గజల్ శ్రీనివాస్ కు బెయిల్

0
49

లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కు బెయిల్ మంజూరయింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ గజల్ శ్రీనివాస్ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించిన నాంపల్లి కోర్టు శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. పోలీసుల అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లరాదని చెప్పడంతో పాటుగా ప్రతీ బుధవారం, ఆదివారం పోలీసుల ఎదుట హజరు కావాలని గజల్ శ్రీనివాస్ ను కోర్టు ఆదేశించింది.
తన వద్ద పనిచేస్తున్న ఒక యువతిని వేధించిన కేసులో గజన్ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు పంజాగుట్ట పోలీస్ సేష్టన్ లో సదరు యువతి ఫిర్యాదు చేయడంతో పాటుగా శ్రీనివాస్ వేధింపులకు సంబంధించిన పక్కా ఆధారాలను ఆ యువతి పోలీసులకు సమర్పించింది. గజల్ శ్రీనివాస్ కార్యాలయంలోనే మరో యువతితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు కెమేరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా గజన్ శ్రీనివాస్ ను అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు. ఇదే కేసులో రెండ నిందితురాలిగా ఉన్న మహిళకు గతంలోనే బెయిల్ మంజూరయింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here