లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ కు రిమాండ్

తనవద్ద పనిచేస్తున్న మహిళను లైంగికంగా వేధింపులకు గురిచేసిన ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టు జనవరి 12 వరకు రిమాండ్ విధించింది. ఆధ్యత్మిక వెబ్ రేడియోను నిర్వహిస్తున్న శ్రీనివాస్ అందులో పనిచేస్తున్న ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీనిపై సదరు మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసుకు సంబంధించి పక్క ఆధారాలు సేకరించిన పోలీసులు గజల్ శ్రీనివాస్ ను అరెస్టు చేశారు. గత రెండు నెలలుగా మహిళను శ్రీనివాస్ వేధింపులకు గురిచేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పంజాగుట్ట ఎసీపీ విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
బాధిక మహిళ పట్ల గజల్ శ్రీనివాస్ అత్యంత దారుణంగా వ్యవహరించినట్టు పోలీసులు చెప్తున్నారు. కార్యాలయంలోని ప్రత్యేక రూంలో తనకు మసాజ్ చేయమంటూ గజల్ శ్రీనివాస్ వేధింపులకు గురిచేసినట్టు పోలీసులు తెలిపారు. గజల్ శ్రీనివాస్ కు అదే కార్యాలయంలో పనిచేసే మరో మహిళా ఉద్యోగి కూడా సహకరించేదని పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ చెప్పినట్టు చెస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సదరు మహళా ఉద్యోగి కూడా బాధిత మహిళతో అన్నట్టు పోలీసులకు ఫిర్యాదు రావడంతో అమెపై కూడా కేసును నమోదు చేశారు.
అయితే గజల్ శ్రీనివాస్ మాత్రం తనకు ఏ పాపం తెలియదని అంటున్నాడు. సదరు మహిళ తనకు తెలుసని అయితే ఎన్నడూ ఆమెను వేధింపులకు గురిచేయలేదని చెప్తున్నారు. తనకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో బుజం, కాళ్లకు దెబ్బలు తగలడంతో ఫిజియోథెరపీ చేయించుకుంటున్నానని గజల్ శ్రీనివాస్ చెప్తున్నాడు. ఫిజియో డాక్టర్ రాకపోవడంతో సదరు మహిళతో ఫిజియో చేయించుకున్నాను తప్ప ఎటువంటి తప్పు చేయలదని చెప్తున్నాడు.